GodavariMaa

Button Ads

acmewebtech

సీమాంధ్ర రాజధానిగా రాజమండ్రి

సీమాంధ్ర

రాజమండ్రి సీమాంధ్ర రాజధానిగా అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో "ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజమండ్రిని చేయాలి" అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రికి రాజధానిగా ఉండగల అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విమానాశ్రయం, ఓఎన్‌జీసీ, ఆధునిక ఆస్పత్రులు, నీటి పారుదల సౌకర్యం ఉందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గల ప్రాంతానికి మధ్యలో ఉందని తెలిపారు. మానవహక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజమండ్రిని రాజ దానిగా చేసేందుకు వందశాతం అనుకూలమైన వనరులున్నాయన్నారు. సామర్లకోట ప్రాంతం పారిశ్రామిక కారిడార్‌కు అనువైన దని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆరువేల ఎకరాలు వరకు భూములు ఉన్నాయన్నారు.