GodavariMaa

Button Ads

acmewebtech

అధిక ఆక్సిజన్ అందించే గోల్డ్‌చైన్ మొక్క ఆవిష్కరణ

అధిక

గ్లోబల్ వార్మింగ్‌తో పర్యావరణ సమతుల్యత దెబ్బతిని అనేక ప్రకృతి వైపరీత్యాలు ఎదుర్కొంటున్నామని, పెరిగిన కాలుష్యంతో సగటు మనిషి జీవన ప్రమాణం తగ్గిపోతోందని, ఈ వైపరీత్యాన్ని అరికట్టే శక్తి పచ్చని మొక్కల పెంపకంతోనే వుందని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అటువంటి మొక్కలకు ఊపిరిపోస్తూ కడియం నర్సరీ రైతులు పర్యావరణ ప్రదాతలుగా మారారు. ప్రస్తుతం వున్న దేశీయ, విదేశీ మొక్కలే కాకుండా నిత్యం ప్రపంచాన్ని శోధిస్తూ మరిన్ని సరికొత్త మొక్కలు సేకరించి వాటిని అభివృద్ధి చేసి సమాజానికి అందిస్తున్నారు. అటువంటి సేకరణలో అరుదైన విదేశీ మొక్క గోల్డ్‌చైన్ ఒకటి. కడియపులంక శ్రీ సత్యదేవ నర్సరీలో లో ఫ్రాన్సిస్ లాటిసన్ శాస్ర్తియనామం కలిగిన విదేశీ మొక్కను సేకరించి దానికి గోల్డ్ చైన్‌గా నామకరణం చేసి విజయదశమి కానుకగా నర్సరీలకు పరిచయం చేశారు. సర్ ఆర్దర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు ఈ మొక్కను మలేషియాలో సేకరించి ఇక్కడి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేయడంతో పాటు ఆ జాతి మొక్కను దేశవ్యాప్తంగా విస్తరింపచేసేందుకు భారీగా మొక్కలను ఉత్పత్తి చేశారు. సాధారణ మొక్కల కంటే అధిక శాతం ఆక్సిజన్ అందించే శక్తి గల ఈ మొక్క అలంకారంగా, నీడనిచ్చే వృక్షంగా పెంచుకోవచ్చని ఆలిండియా నర్సరీమెన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పుల్లా వీర వెంకటరావు తెలిపారు. ఈ మొక్క నుండి వికసించే పుష్పం మేలిమి ఛాయతో గోల్డ్ చెయిన్ మాదిరిగా కన్పిస్తుంది. ఈ సరికొత్త మొక్కను సర్ ఆర్దర్ కాటన్ నర్సరీమెన్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తాడాల వీరాస్వామి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నర్సరీ రైతులు పుల్లా సత్యనారాయణ, రావిపాటి ఆదినారాయణ, పుల్లా చంటి, పుల్లా పెదవెంకన్న, ఆకుల నాగులు, రావిపాటి వెంకట్రావు, అసోసియేషన్ డైరెక్టర్లు, పలువురు రైతులు పాల్గొన్నారు.