GodavariMaa

Button Ads

acmewebtech

మహాసేన్ తుపాను గోదావరి డెల్టా రైతులకు దడ పుట్టిస్తోమహాస&

మహాసేన్

బంగాళాఖాతంలో ఏర్పడిన మహాసేన్ తుపాను గోదావరి డెల్టా రైతులకు దడ పుట్టిస్తోంది. ఈ తుపాను మన రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండదని వాతావరణ హెచ్చరికల కేంద్రం చెబుతున్నప్పటికీ, ఆదివారం సాయంత్రం నుండి ఆకాశం మేఘావృతమై, ఈదురు గాలులు వీయటంతో రైతుల్లో ఆందోళన మొదలయింది. కొన్ని ప్రాంతాల్లో ఒక మాదిరి నుండి భారీ వర్షం కూడా కురవటంతో మరోసారి దెబ్బతినాల్సి వస్తుందని రైతులు భయం భయంగా గడుపుతున్నారు. నీటి కొరత సమస్య నుండి గట్టెక్కుతున్న దశలో రబీ రైతులపై అకాల వర్షాలు విరుచుకుపడటంతో ఇప్పటికే చాలా మంది రైతులు నష్టపోయారు. పోనీ మిగిలిన పంటనైనా దక్కించుకుందామన్న ఆశతో పనులు ముమ్మరంగా చేసుకుంటున్న దశలో ఇపుడు మళ్లీ మహాసేన్ రూపంలో గోదావరి రైతులకు ఈ తుపాను మహాశనిలా పట్టింది. అందులోనూ ఆలస్యంగా రబీ పనులు మొదలుపెట్టిన రైతులు మరింత ఆందోళనకు గురవుతున్నారు. గోదావరి జిల్లాల్లో ముందుగా రబీ సాగు చేపట్టిన రైతులు కొంత వరకు పంటను ఇంటికి చేర్చారు. ఆలస్యంగా సాగు మొదలుపెట్టిన వారి పంట ఇంకా పొలాల్లోనే ఉంది. ఒకేసారి రైతులంతా పనులు మొదలుపెట్టడంతో కూలీల కొరత ఏర్పడి, పొలాల్లోని పంటను ఇంటికి చేర్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. యంత్రాలతో పంటను కోసుకున్న రైతులు కూలీలు లేకపోవటంతో తమ పంటను ఇప్పటికీ పొలాల్లోనే వదులుకోవాల్సి వస్తే, మరికొంత మంది గట్లమీదే ఉంచాల్సి వచ్చింది. కూలీలు దొరికిన వెంటనే పంటను ఇళ్లకు చేర్చుకుందామనుకునే లోపు మహాసేన్ వచ్చిపడింది. దీంతో రైతులు రానున్న రెండు రోజుల్లో ఏం జరుగుతుందోcని ఆందోళనచెందుతున్నారు.