GodavariMaa

Button Ads

acmewebtech

రైతు సదస్సులు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్

రైతు

ఈ నెల 12 నుంచి 16వ తేదీ వరకు రెవెన్యూ డివిజన్‌ల వారీగా రైతు సదస్సులను నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ తెలిపారు. అనుబంధ శాఖల భాగస్వామ్యంతో నిర్వహించే ఈ రెవెన్యూ సదస్సులు , 14న రాజమండ్రి డివిజన్‌కు సంబంధించి గోకవరం మండలం కృష్ణునిపాలెం మండల పరిషత్ పాఠశాల ప్రాంగణంలో నిర్వహిస్తామని చెప్పారు.ఈ రైతు సదస్సులు ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుండి ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ సదస్సుల్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఆదర్శ రైతులు, మహిళా రైతులు, రైతు సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు. ఈ సదస్సుల్లో రైతులకు అవగాహన కలిగించేందుకు పెద్ద ఎత్తున ఎగ్జిబిషన్, లైవ్ డెమో కార్యక్రమాలు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ సదస్సుల్లో వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు, గ్రామ విత్తన కార్యక్రమం కింద విత్తనాలు పంపిణీ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. రైతుల నుండి సలహాలు, సూచనలు తీసుకుని అక్కడికక్కడే పరిష్కరించడం వంటి కార్యక్రమాలు ఈ సదస్సుల్లో చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ సదస్సులకు రైతులు అధిక స్థాయిలో హాజరయ్యేలా వ్యవసాయ శాఖాధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ కోరారు.