GodavariMaa

Button Ads

acmewebtech

శ్రీరామనవమిని పురస్కరించుకుని

శ్రీరామనవమిని

శ్రీరామనవమిని పురస్కరించుకుని రీజనల్ మేనేజర్ జి రమాకాంత్ భద్రాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం జిల్లా నుంచి 100 ప్రత్యేక బస్సులు ఈనెల 18నుంచి 20వ తేదీ వరకు నడుస్తాయన్నారు. 19వ తేదీన కళ్యాణం అనంతరం తిరిగి బస్సులు జిల్లాకు చేరతాయన్నారు. రాజమండ్రి నుంచి 30, గోకవరం డిపో నుంచి 6, కాకినా నుంచి 25, రావులపాలెం నుంచి 8, రాజోలు నుంచి 6, ఏలేశ్వరం నుంచి 5, తుని నుంచి 5, రామచంద్రపురం నుంచి 5, అమలాపురం నుంచి 10 ప్రత్యేక బస్సులను భద్రాచలం నడపనున్నట్లు చెప్పారు. ఈబస్సులకు ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని స్పష్టం చేశారు. రాజమండ్రి నుంచి రూ. 147, కాకినాడ నుంచి 170 చార్జీగా వసూలు చేస్తామన్నారు. తుని వయా కాకినాడ మీదుగా కర్నూలుకు ప్రతీరోజూ బస్సును నడుపుతున్నట్లు చెప్పారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హాయ్‌లాండ్ రిసార్ట్స్‌తో ఆర్టీసీ ఒప్పందం చేసుకుందని, ఈనెల 21 నుంచి రాజమండ్రి నుంచి ప్రతీ ఆదివారం హాయ్‌లాండ్‌కు విహారయాత్రా బస్సును నడుపుతామన్నారు. ఉదయం 6గంటలకు రాజమండ్రిలో బయలుదేరి, విజయవాడ శ్రీకనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి, హాయ్‌లాండ్ చేరుకుంటుందన్నారు. రిసార్ట్స్‌లో సేదదీరిన ప్రయాణీకులకు మధ్యాహ్నం రిసార్ట్స్‌లోనే భోజనం ఏర్పాటు చేస్తారన్నారు. రాత్రికి విజయవాడలో భోజనం ఏర్పాటు చేస్తామని, అదేరోజు బస్సు రాజమండ్రికి చేరుతుందని రమాకాంత్ వివరించారు. పెద్దలకు రూ. 1000, పిల్లలకు 750 టిక్కెట్‌గా వసూలు చేస్తామని పేర్కొన్నారు. ఈసమావేశంలో డిప్యుటీ సిటిఎం వరప్రసాద్, డిపో మేనేజర్ టివిఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.