GodavariMaa

Button Ads

acmewebtech

పసిడి ధరలు రోజు రోజుకు తిరోగమన

పసిడి

పసిడి ధరలు రోజు రోజుకు తిరోగమన బాటపడుతున్నాయి. దేశ రాజధానిలో పది గ్రాముల బంగారం రూ.750 క్షీణించి రూ.27,600 వద్ద ముగిసింది. స్టాకిస్టులు తమ వద్ద ఉన్న బంగారాన్ని పెద్ద ఎత్తున విక్రయించడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి.గత కొన్ని రోజుల్లో బంగారం రూ.1,250 వరకు తగ్గింది. డిసెంబర్ 31, 2011 నాటికిస్థాయికి బంగారం పడిపోయింది. దాంతో పాటు వెండి కూడా కిలో రూ.2,100 వరకు క్షీణించి రూ.48,000 కిలో పలుకుతోంది. శనివారం నాడు ఒక్కరోజే రూ.2,500 వరకు తగ్గింది. వెండి కొనుగోలు చేసేందుకు పరిశ్రమల యూనిట్ల వారు నాణెల తయారు చేసే వారు ముఖం చాటేశారు. అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం పెద్ద ఎత్తున విక్రయానికి రావడంతో బంగారం తగ్గుముఖం పట్టింది.
ముఖ్యంగా యరోపియన్ దేశాలైన సైప్రెస్, గ్రీస్ లాంటి దేశాలు టన్నుల కొద్ది బంగారం విక్రయించి అప్పులు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాబోయే రోజుల్లో బంగారం మరింత తగ్గే అవకాశం ఉంది. లండన్‌లో 90.70 డాలర్లు లేదా 6.14 శాతం తగ్గి 1386.30 ఔన్స్ విక్రయిస్తున్నారు. వెండి కూడా 10.52 శాతం క్షీణించి 23.13 డాలర్లు ఔన్స్ విక్రయిస్తున్నారు. ఇకదేశీయ మార్కెట్ విషయానికి వస్తే బంగారం 99.9 స్వచ్చత, 99.5 శాతం స్వచ్చత కలిగిన బంగారం రూ.750 తగ్గి రూ.27,600 రూ.27,400కు పడిపోయింది. ఎనిమిది గ్రాముల సొవరిన్ బంగారం రూ.100 తగ్గి రూ.24,700 మార్కుకు వెండి విషయానికి వస్తే కిలో రూ.2,100 చొప్పున తగ్గి రూ.48,000 పడిపోయింది.Get current information about 24 & 22Ct Gold prices in Rajahmundry Click Here