GodavariMaa

Button Ads

acmewebtech

పుష్కర్‌ఘాట్‌లోని గోదావరి మాత విగ్రహం ప్రత్యేక శోభ

పుష్కర్‌ఘాట్‌లోని

పుష్కర్‌ఘాట్‌లోని గోదావరి మాతకు ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ మధు ఫోమ్రా దంపతులు గురువారం వెండి కిరీటాన్ని బహూకరించారు. సుమారు కేజి వెండితో చేయించిన కిరీటాన్ని ఉగాది సందర్భంగా దేవాదాయశాఖ డిప్యుటీ కమిషనర్ హనుమంతరావు చేతుల మీదుగా గోదావరి మాతకు అలంకరించారు. కిరీటాన్ని అలంకరించిన అనంతరం గోదావరి మాత విగ్రహం ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రమేష్‌బాబు, డాక్టర్ మధు ఫోమ్రా, దేవాదాయశాఖ ఇఓ తారకేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.