GodavariMaa

Button Ads

acmewebtech

గోదావరి పుష్కరా ముందస్తు సన్నాహాలు

గోదావరి

ప్రతీ 12 ఏళ్ళకు ఒకసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గోదావరి పుష్కరాలను ఈసారి కూడా రెట్టింపు స్థాయిలో నిర్వహించేందుకు ముందస్తు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఈ గోదావరి పుష్కరాలు 2015 జూలై నెలలో జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి పనులను ఈఏడాది నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే అన్ని ప్రభుత్వ శాఖలతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాజమండ్రిలో 4 నెంబర్ల రైల్వే ఫ్లాట్‌ఫారమ్స్‌ను కూడా నిర్మించేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. లక్షల సంఖ్యలో హాజరయ్యే భక్తులకు అవసరమైన కనీస సదుపాయాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు.
2003 జూలై-ఆగస్టు నెలల్లో నిర్వహించిన గోదావరి పుష్కరాలకు రోజూ లక్షల సంఖ్యలో భక్తులు హాజరై గోదావరి నది పుణ్యస్నానాలు ఆచరించేవారు. వారందరికీ, రవాణా, నివాసం, తాగునీటి సరఫరా, స్నానఘట్టాల వద్ద భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించడం వంటి కార్యక్రమాలను ఎంతో చక్కగా చేశారు. రాష్ర్ట ప్రభుత్వం, మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిధులు కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిర్వహించి, రాజమండ్రి నగరం రూపురేఖలనే పూర్తిగా మార్చేశారు.


http://www.godavaripushkaram.com/


అప్పట్లో స్థానిక పుష్కరఘాట్‌ వద్ద జల్లు స్నానఘట్టం నిర్మాణం వంటివి చేపట్టగా, ఇప్పుడు పుష్కరఘాట్‌ వద్ద ఉన్న మొదటి రైల్వేవంతెనను టూరిజం స్పాట్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందించారు. అలాగే అప్పట్లో రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో తూర్పు వైపు టిక్కెట్‌ కౌంటర్‌ను ఏర్పాటు చేయడంతోపాటు రెండో ప్లాట్‌ఫారంను అభివృద్ధి చేయడం జరిగింది. ఇప్పుడు పుష్కరాలకు ముందే 3, 4 నెంబర్ల ఫ్లాట్‌ఫారమ్స్‌ను కూడా నిర్మించాలని నిర్ణయించారు. అలాగే నగరంలోని రోడ్లు నిర్మాణం, పార్కుల ఆధునీకరణ, పుష్కరాలకు హాజరయ్యే భక్తులకు కావాల్సిన కనీస సదుపాయాల కల్పన, నగరం సుందరీకరణ వంటి పనులన్నీ ముందుగానే పూర్తి చేసేందుకు, అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు చర్యలు మొదలయ్యాయి.
ఈ పనులన్నీ ముందుగానే పూర్తిస్థాయిలో పూర్తి చేసేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు తనదైనశైలిలో పనులు ప్రారంభించారు. ముందుగా పుష్కరాల నిర్వహణకు సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమన్వయ సమావేశాన్ని త్వరలో నిర్వహించేందుకు ఎమ్మెల్యే రౌతు నిర్ణయించారు. భక్తులకు కనీస సదుపాయాలు కల్పించడంతోపాటు నగర అభివృద్ధికి సంబంధించి కూడా అనేక పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. పుష్కరాల లోపుగా పెండింగ్‌లో వున్న పలు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టనున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ పనులన్నీ ఈ ఏడాది నుంచే ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.