GodavariMaa

Button Ads

acmewebtech

వేసవి ప్రారంభంలోనే రాజమండ్రి ప్రజలకు తాగునీటి తిప్పలు త

వేసవి

గోదారి పక్కనే ఉన్నా ప్రజలు గుక్కెడు నీటి కోసం అల్లల్లాడుతున్నారు. తాగునీటికోసం గంటల తరబడి కుళాయిల వద్ద పడిగాపులు కాస్తున్నారు..నగరశివారుల్లోని క్వారీ ఏరియా, సింహాచలనగర్, మల్లికార్జుననగర్, బర్మాకాలనీ, రాందాసుపేట, సుబ్బారావుపేట, సంజీవయ్యనగర్, మన్సిపల్ కాలనీ, లాలాచెరువు ప్రాంతాలు వేసవి ప్రారంభంలోనే తాగునీటి సమస్యతో సతమతమవుతున్నాయి..కార్పోరేషన్ వారు తాగునీరు సరఫరా చేస్తున్న కుళాయిలకు మోటార్లు పెట్టి ధనవంతులు తోడుకుంటున్నారు..దీంతో కొని ప్రాంతాలకు తాగునీరు అందడం లేదు..దీనికి తోడు బ్రిటిష్ కాలం నాడువేసిన పైపులైన్లే తప్ప, పెరిగిన జనానికి తగ్గట్లుగా వాటిని ఆధునీకీకరించిదిలేదు..దీంతో వేసవి ప్రారంభంలోనే రాజమండ్రి ప్రాంత ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పడంలేదు.
ఇప్పుడే ఇలా ఉంటే మండువేసవిలో మా పరిస్థితి ఏంటని మహిళలు వాపోతున్నారు.దీనికి తోడు రాజమండ్రి కార్పోరేషన్ పనితీరు కుడా తాగు నీటి సమస్యకు కారణం అవుతోంది..కార్పోరేషన్ పరిధిలో 120 మిలియన్ లీటర్ల తాగునీరు అవసరం ఉండగా,కేవలం 65 మిలియన్ లీటర్ల నీటిని మాత్రమే గోదావరి నుంచి మోటర్లద్వారా తోడి, శుద్దిచేసి సరఫరా చేస్తోంది. అంటే నిత్యం 55 మిలియన్ లీటర్ల తాగునీరు కొరత ఏర్పడుతోంది..ఇటీవల మున్సిపల్ శాఖ మంత్రి 10 మిలియన్ లీటర్ల నీటిని శుధ్దిచేసే ప్లాంట్ కు శంకుస్థాపన చేశారు.,.అది పూర్తయితే సమస్య కొంత మేర తగ్గే అవాశం ఉంది.. అప్పటికి కూడా మరో 45 మిలియన్ లీటర్ల నీటికొరత తప్పదు..పరిస్థితి గమనించి కార్పోరేషన్ అధికారులు తగిన చర్యలు తీసుకొని రాజమండ్రి ప్రాంతాల తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

Water Supply Timmings in Rajahmundry :

http://rajahmundry.me/Rajamahendravaram/WaterSupplyTimmingsinRajahmundry.php