GodavariMaa

Button Ads

acmewebtech

రాజమండ్రి వేదసభలో శృంగేరి పీఠాధిపతి

రాజమండ్రి

సనాతన ధర్మమే మానవాళికి శరణ్యమని శృంగేరి పీఠాధిపతి భారతీ తీర్థ మహాస్వామి అన్నారు. TTD ఆధ్వర్యంలో వేదవిద్వత్‌ సదస్సు నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి 2 వేల మంది పండితులు తరలి వచ్చారు.రాజమండ్రి గోదావరి తీరం వేదఘోషతో మారుమోగింది. ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో టిటిడి ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో శ్రీనివాస వేదవిధ్వత్సదస్సు నిర్వహించారు. అంతరించిపోతున్న సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకే ఈ బృహత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 2వేల మంది వేద పండితులు పాల్గొని వేద ఘోష చేశారు.వేద వాజ్ఞయంపై ప్రసంగపాఠాలు, శాస్త్రచర్చలు సుదీర్ఘంగా సాగాయి. సాయంత్రం భారతీ తీర్థ మహాస్వామి ఆద్వర్యంలో వేదపండితులకు సత్కారం నిర్వహించారు. సనాతన ధర్మమే మానవాళికి శరణ్యమని భారతీ తీర్థ మహాస్వామి అనుగ్రహా భాషణం చేశారు. మానవునికి శ్రేయోధర్మాన్ని అందించేదే సనాతన ధర్మమని ఉద్బోదించారు. ఇంటిని నిలబెట్టుకునేందుకు నాలుగు స్థంభాలు ఎలా ఉపయోగపడతాయో, సనాతన ధర్మం అనే సౌదాన్ని నిలబెట్టుకునేందుకు నాలుగు రిధమ్‌లు అవసరమని ఆయన చెప్పారు. రాజమహేంద్రవరంలో సాగిన ఈ కార్యక్రమంలో TTD ఈవోతోపాటు పలువురు పురాణ పండితులు పాల్గొన్నారు.