GodavariMaa

Button Ads

acmewebtech

రాజమండ్రి మహిళలకు పోలీసుల భరోసా

రాజమండ్రి

రాజమండ్రి లో మహిళా వేధింపులు, ఈవ్‌టీజింగ్ అరికట్టేందుకు వంద మహిళా ఫిర్యాదు బాక్సులను ఏర్పాటు చేయనున్నట్టు అర్బన్ ఎస్పీ T. రవి కుమార్‌ మూర్తి వెల్లడించారు. ఢిల్లీ అత్యాచార ఘటన నేపధ్యంలో మహిళలపై పూర్తిస్థాయిలో వేధింపులు నివారించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్పారు. అందులో భాగంగానే రాజమండ్రి అర్బన్ జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తున్నట్టు ఎస్పీ తెలిపారు. విద్యార్థినులు, మహిళలపై జరుతున్న వేధింపులను నివారించేందుకు విద్యా సంస్థలు, ఉమెన్ హాస్టల్స్, మహిళలు ఎక్కువగా సంచరించే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్లు తదితర ప్రాంతాల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈవ్‌టీజర్ల నుండి ఎలాంటి ముప్పూ వాటిల్లకుండా కేవలం వారి సెల్ నంబర్లు, మోటారు సైకిల్ నంబర్లు రాసి, బాక్సులో వేస్తే వారికి తగిన గుణపాఠం చెబుతామని, సోదరులుగా రాజమండ్రి పోలీసులు మహిళలకు, విద్యార్థినులకు అండగా నిలుస్తారని భరోసా ఇచ్చారు. ఈవ్‌టీజర్లపై నిఘా వేసేందుకు అడిషినల్ ఎస్పీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించినట్టు తెలిపారు. బోగస్ ఫిర్యాదులను పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని రవి కు మార్‌ మూర్తి వివరించారు.