GodavariMaa

Button Ads

acmewebtech

రాజమండ్రి అన్ని వర్గాల నుంచి నిరసన గళం ఉవ్వెత్తున లేచింద

రాజమండ్రి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ వైద్య విద్యార్థినిపై అత్యాచార ఘటన విషాదాంతమైంది. బాధితురాలు మృత్యువుతో పోరాడి చివరకు కన్నుమూసిందన్న వార్త విన్న రాజమండ్రి వాసులకు ఒక్కసారిగా ఆగ్రహం పెల్లుబికింది. రాజమండ్రి అన్ని వర్గాల నుంచి నిరసన గళం ఉవ్వెత్తున లేచింది. ముఖ్యంగా విద్యార్థి ఉద్యమం తారా స్థాయికి చేరింది. దోషులను వెంటనే కఠినంగా శిక్షించాలంటూ విద్యార్థి లోకం నినాదాలు చేసింది. భారీ ర్యాలీలు, మానవహారం వంటివి నిర్వహించారు. ముఖ్యంగా శనివారం రాత్రి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యార్థులు, యువకులు, మహిళలు, వివిధ రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సేవా సంస్థల సభ్యులు కొవ్వొత్తుల ప్రదర్శనలు నిర్వహించారు. వైద్య విద్యార్థినిపై జరిగిన అత్యాచార ఘటనను తీవ్రంగా ఖండించారు. వెంటనే దోషులను కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.
ఆదిత్య విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించగా, రాజమహేంద్రి విద్యాసంస్థల విద్యార్థినులు మానవహారం నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్ష కార్యదర్శులు ముప్పాళ్ళ సుబ్బారావు, తవ్వాల వీరేంద్రనాధ్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు, విద్యా సంస్థల ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.